- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి విడత ఎన్నికలకు అంతా రెడీ..!
దిశ, సంగారెడ్డి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి ఘట్టమైన మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ

దిశ, సంగారెడ్డి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి ఘట్టమైన మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 17న ఉదయం 7 గంటలకు జరగనున్న చివరి మూడో విడత ఎన్నికలకు సంబంధించి భారీ స్థాయిలో మూడంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి మూడో విడత ఎన్నికకు సంబంధించిన ప్రచారానికి తెర పడింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వర్గాలు గట్టి పహారాన్ని కాస్తున్నారు. చివరి ఎన్నికల ప్రక్రియ కోసం 1160 మంది పోలీసు అధికారులు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ పంకజ్ కేటాయించారు.
ఎన్నికల నిర్వహణకు గట్టి బందోబస్తు
సంగారెడ్డి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నారాయణఖేడ్, కంగ్టీ, కల్హేర్, మనూర్, సిర్గాపూర్, నాగల్ గిద్ద, నిజాంపేట్, న్యాల్కల్ కలిపి మొత్తం 8 మండలాలలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 234 గ్రామ పంచాయితీలకు గాను 27 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, 207 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేదుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రత ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. అయితే మూడో విడత ఎన్నికలు జరగనున్న మండలాలలో గల సమస్యాత్మక, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన, హిస్టరీ షీట్ గల 1583 మందిని సత్ప్రవర్తన కోరుతూ వారిని ముందస్తుగా బౌండ్ ఓవర్ చేశారు. ఎన్నికలు జరగనున్న మండలాలలో పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి అంటే ఈ నెల 15న సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు 'సైలెంట్ పీరియడ్' ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం పూర్తిగా నిషేదం విధించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, మద్యం, డబ్బు పంపిణీ చేసినా, సోషల్ మీడియాలో, ఇతర ప్రసార మాద్యమాలలో వ్యక్తులను గాని, రాజకీయ పార్టీలను గాని కించపరిచేలా తప్పుడు ప్రచారాలు చేసి, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు గట్టి హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండి ఎన్నికల నియమావాలిని పాటించాలని అలా కాదని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పోలీసు అధికారులు కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు చేశారు. మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో మొదటి రెండు విడతల ఎన్నికల్లో చిన్న చిన్న గొడవలు ఇతర ఘటనలతో ప్రశాంతంగానే పూర్తి కాగా, చివరి మూడో విడత ఎన్నికల ప్రక్రియను అంతే ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అందరూ అలర్ట్ గా ఉన్నారు.
రూ. 11.68 లక్షల విలువ గల మద్యం సీజ్
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినందుకు అక్రమంగా రవాణా చేసిన, దాచి ఉంచిన రూ.11.68 లక్షల విలువగల 1704 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు 148 కేసులు ఇందులో భాగంగా నమోదు అయ్యాయి.






