- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ భక్త మార్కండేయ ఆలయ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం..
నారాయణఖేడ్ పట్టణంలోని వెంకటాపూర్ చౌరస్తాలో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి 23, సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలోని వెంకటాపూర్ చౌరస్తాలో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి 23, సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గురురాజు శర్మ వారి శిష్య బృందం ఆధ్వర్యంలో గణపతి హోమం, ప్రత్యేక అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు దత్తాత్రేయ టెంపుల్ నుంచి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర, మహిళల కోలాటం, సీతమ్మ జడకొప్పు తదితర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ, వైరాగ్య శిఖామణి అవధూత మహారాజ్, సంగ్రామ్ మహారాజ్, కరణ్ గజేంద్ర భారతి మహారాజుల దివ్య ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికంగా అలరించనున్నాయి. భక్తుల కోసం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరారు.






