- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాల్య వివాహాలను నిర్మూలించాలి : సీడీపీఓ స్వరూప
దిశ, చిన్న శంకరంపేట : బాల్య వివాహాలను నిర్మూలించాలని ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూప తెలిపారు. సోమవారం బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన బాల్యవివాహాల నిర్మూలన సదస్సుకి ఆమె హాజరయ్యారు.

దిశ, చిన్న శంకరంపేట : బాల్య వివాహాలను నిర్మూలించాలని ఐసీడీఎస్ సీడీపీఓ స్వరూప తెలిపారు. సోమవారం బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన బాల్యవివాహాల నిర్మూలన సదస్సుకి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలకు తెలియజేయాలన్నారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలన్నారు. నేటి సమాజంలో బ్రూణ హత్యలు, మహిళలపై లైంగిక వేధింపులు, లింగ నిర్ధారణ, అక్రమ దత్తత, బాల్యవివాహాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి దారుణాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గర్భధారణ ముందు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్య నేరమని అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆడపిల్లలకు సమాన అధికారాలు, అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రభుదాస్, ఎంపీఓ గిరిజారాణి, ఎంఈఓ కృష్ణవేణి, సిహెచ్ఓ యాదగిరి,పర్యవేక్షరాలు సంధ్య, అంజమ్మ, ఐ సిపిఎస్ న్యాయ సలహాదారుడు బాల నరసింహులు, విజన్ ఎన్జీవో యాదగిరి, పాన్ ఇండియా ఎన్జీవో వెంకటేశ్వర్లు, షీ టీం అధికారిని గంగమని, ఎస్సై నారాయణ, ఆయా గ్రామాల సమైక్య మహిళా అధ్యక్షురాలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






