- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పథకం 2025 చట్టాన్ని కొనసాగించాలి : CPM
దిశ, దుబ్బాక : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025 చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో

దిశ, దుబ్బాక : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025 చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలో ని ఉపాధి హామీ నూతన చట్టం కాఫీలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ.. నూతన చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం.. పేదలను మరింత పేదరికంలో పడేసే విధానాలే తప్ప గ్రామీణ స్థాయి పేదరికం నిర్మూలించేదిగా లేదని విమర్శించారు.2005 చట్టం వలన గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ ఏడాది కాలంలో కనీసం వంద రోజులు పని తగ్గకుండా ఉపాధిని గ్యారెంటీ చేసిందని తెలిపారు. ఉపాధి పని అడిగిన ప్రతి ఒక్కరికి బడ్జెట్ పరిమితులు లేకుండా పని కల్పించాలని, పాత పథకానికి డిమాండ్ ను బట్టి బడ్జెట్ కేటాంపులు జరిగేవి కానీ నూతన చట్టం వలన బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్టుగా పని కల్పించే విధానం తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు.
పని కల్పించాలని అడిగిన 15 రోజులలో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రధానంగా రైతుల పొలాలకు రహదారులు అభివృద్ధి చేయడం, చెరువుల పూడికతీత ఎస్సి, ఎస్టీ, బీసీ లాంటి సామాజిక తరగతుల భూములు కాలనీలా అభివృద్ధి ఇండ్ల నిర్మాణం లాంటి వాటికోసం ప్రాధాన్యతలు ఉండేవని కానీ నూతన చట్టంలో వీటన్నిటిని తొలగించడం జరిగిందని విమర్శించారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో పథకం అమలు కోసం బడ్జెట్ లో 4 శాతం నిధులు కేటాయింపులు చేస్తే 2014 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాటి నుండి బడ్జెట్ క్రమక్రమంగా నిధులు తగ్గిస్తూ ఈ సంవత్సరం 1.37శాతం మాత్రమే కేటాయింపులు చేసిందని విమర్శించారు. దీని వల్ల ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, సాదిక్, లక్ష్మీ నర్సయ్య, సాజిద్, బాసిత్ పాల్గొన్నారు.






