- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, హత్నూర: హత్నూర మండలంలోని సికింద్లాపూర్ కాసాల గ్రామాల పరిధిలో ఉన్న రైతుల బోరు బావుల వద్ద ఉన్న స్టార్టర్ బాక్స్‌లను తీసుకొని వెళ్ళిన విద్యుత్ అధికారులు. ప్రతి నెలా చెల్లించాల్సిన సర్ చార్జ్‌లను రైతులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యాసంగి పంట సాగు సమయంలో ఇలా చేయడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కూరగాయలు నాటడానికి నారు సిద్ధం చేసుకుంటున్న సమయంలో అధికారులు వచ్చి బాక్స్‌లు తీసుకెళ్లారు. దీంతో సిద్ధం చేసుకున్న పంటపొలాలు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు స్టార్టర్ బాక్స్‌లను ఇప్పించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
Next Story






