గంగమ్మ ఒడిలోనే వనదుర్గమ్మ

by velandi.Saikiran |

పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ ఇంకా గంగమ్మ ఒడిలోనే ఉంది

గంగమ్మ ఒడిలోనే వనదుర్గమ్మ
X

గంగమ్మ ఒడిలోనే వనదుర్గమ్మ..

* ఆరో రోజు సైతం జలదిగ్బంధంలో వనదుర్గమ్మ

* రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహానికి పూజలు

దిశ, పాపన్నపేట: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం, జనమే జయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ ఇంకా గంగమ్మ ఒడిలోనే ఉంది. ఆలయం చెంత గంగమ్మ ఉధృతి ఇంకా పెరిగింది. ఆరో రోజు సైతం వనదుర్గమ్మ జలదిగ్బంధంలోనే ఉంది. ఏడు నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నుండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో ఆలయానికి రాకపోకలు స్తంభించాయి. దీంతో గురువారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రాజ గోపురంలో వనదుర్గా మాత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా పున ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు.

Next Story