- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం -దుబ్బాక ఎమ్మెల్యే
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ, మిరుదొడ్డి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. యూరియా సరఫరా లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట- భూంపల్లి చౌరస్తాలో దుబ్బాక ఎమ్మెల్యే, మంగళవారం రైతులతో కలిసి జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ కు చేసిందేమి లేదని, ఢిల్లీ నుండి యూరియా సంచులు తెచ్చే సోయి లేదని ఆయన ఏద్దవా చేశారు.
కేసీఆర్ హయంలో పదేళ్ల లో రాని యూరియా కొరత నేడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పై ఒక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదని, దీన్ని బట్టి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమైతుందన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలోనే పోలీసులు కలుగజేసుకొని రాస్తా రోకోను విరమింపజేశారు.






