- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందని నేడు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై 6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసి ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

దిశ, గజ్వేల్ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందని నేడు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై 6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి రూ.లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ రూ.2500 ప్రతినెల ఇస్తామని చెప్పి మోసం చేసిందని, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకురూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. రైతులకు ప్రతి ఎకరానికి రూ.15000 ఇస్తామని చెప్పి మోసం చేసిందని, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయడంలో, రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సరఫరా చేయడంలో, రైతాంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడంలో, రైతుల పండించిన పంటలను గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కొనుగోలు చేయడంలో, రైతులకు బోనస్ ఇస్తామని, రైతులకు కూలీ రైతులకు పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు.
ఆటో డ్రైవర్లకు రూ.12 వేల సహాయం ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. రూ.ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. బీసీల కోసం గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిధులు సున్నా శాతం కూడా బీసీలకు ఇవ్వలేదని బీసీలను కూడా మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరిత ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అసమర్థ విధానాల వలన గ్రామాలలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని, గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులను పంచాయతీలకు మంజూరు చేయడం లేదని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు రాలేక అల్లాడుతున్నారని కనీసం పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాబట్టి గ్రామాలలోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు గ్రామ సభలలో కాంగ్రెస్ హామీలపై ఆరు గ్యారెంటీలపై నిలదీయాలని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.






