- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

బస్సులో దొరికిన బ్యాగ్ ను ప్రయాణికురాలికి అప్పగించిన డ్రైవర్
అందులో పది తులాల బంగారం.. 15 తులాల వెండి
డ్రైవర్ షాదుల్లాను అభినందించిన డీపో మేనేజర్
దిశ, మెదక్ ప్రతినిధి : భూమి మీద మంచితనం ఇంకా మిగిలే ఉందని తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ నిరూపించాడు. ప్రయాణికురాలు బస్సులో మరచిపోయిన నగల బ్యాగ్ ను డిపో సెక్యూరిటీకి అప్పగించి డీఎం చేతుల మీదుగా ప్రయాణికులకు అప్పగించిన ఘటన శుక్రవారం మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది. మెదక్ నుంచి ఉదయం రెగోడ్ వెళ్లి తిరిగి వస్తున్న ఆర్టీసీ బస్సులో కొత్వాన్ పల్లి వద్ద యశోద అనే ప్రయాణికులు బస్సు ఎక్కింది.
మార్గమధ్యలో పెద్ద శంకరంపేటలో యశోద బస్సు దిగిపోయింది. కానీ తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ మాత్రం బస్సులోనే వదిలి వెళ్లింది. తిరిగి మెదక్ డిపోకు వస్తున్న బస్సులో బ్యాగ్ ఉన్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ షాదుల్లా తన నిజాయితీని చాటుకున్నాడు. బ్యాగ్ లో 10 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి ఉన్న దురాశ పోకుండా దొరికిన బ్యాగ్ ను తీసుకువచ్చి మెదక్ డిపో సెక్యురిటీలో అప్పగించాడు.
వెంటనే విషయాన్ని డీఎం రవిచంద్ర కు తెలియజేశారు. బ్యాగ్ మర్చిపోయిన ప్రాయాణికురాలు యశోదను అంతటా గాలించి చివరకు మెదక్ డిపోకు చేరుకుంది. డ్రైవర్ షాదుల్లా భద్రంగా తాను బస్సులో మరిచిపోయిన బ్యాగ్ ను సెక్యురిటీలో అప్పగించిన విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. వెంటనే డీఎంను కలిసి బ్యాగ్లో ఉన్న నగల వివరాలు చెప్పడంతో డీఎం బ్యాగ్ ను బాధితురాలికి అప్పగించారు.
అందులో అన్ని సక్రమంగా ఉండడంతో సంతోషంతో ప్రయాణికురాలు యశోద కన్నీరు పెట్టుకుంది. దాదాపు రూ.6లక్షల విలువ గల నగలు ఉన్న బ్యాగ్ తనకు తిరిగి దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. డ్రైవర్ షాదుల్లాకు కృతజ్ఞతలు తెలిపింది. అదేవిధంగా డ్రైవర్ షాదుల్లాను డీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికులు ఆర్టీసీకి దేవుళ్లని, వారి వస్తువులు తిరిగి ఇవ్వడం ఉద్యోగులంతా బాధ్యతగా అందరూ గుర్తించాలన్నారు.






