- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > దళారులను నమ్మి మోసపోవద్దు : మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్
దళారులను నమ్మి మోసపోవద్దు : మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్
రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ బాగానోళ్ల విజయమోహన్ అన్నారు.

X
దిశ, ములుగు : రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ బాగానోళ్ల విజయమోహన్ అన్నారు. మంగళవారం మార్కుక్ మండలంలోని అంగడి కిష్టాపూర్, శివర్ వెంకటాపూర్, ఎర్రవల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎం యాదగిరి ఆధ్వర్యంలో వారు ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధర పొందేందుకు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కాసుల కొండల్ రెడ్డి, నారన్నగారి కవిత రామ్మోహన్ రెడ్డి, తుమ్మల కనకయ్య, మండల ప్రత్యేక అధికారి ఎం.సాగర్, ఎంపీడీవో బి.అశోక్, ఆర్‌ఐ బాలయ్య, సీసీలు విజయ, కవిత, వీవోఏలు దివ్య, బాలమణి, స్వాతి, గ్రామ సంఘాల అధ్యక్షులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
Next Story






