‘నన్ను వెతకకండి నేను మీకు దొరకను’.. భార్యకు ఫోన్ చేసిన భర్త.. చివరికి!?

by Jakkula.Mamatha |

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

‘నన్ను వెతకకండి నేను మీకు దొరకను’.. భార్యకు ఫోన్ చేసిన భర్త.. చివరికి!?
X

దిశ, కొండపాక: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా పుల్లూరుకు చెందిన దేశెట్టి స్వామి(40) హైదరాబాద్‌లోని బాలనగర్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన, ఈ క్రమంలో గత జనవరి 15న ఇంటి నుంచి ఆటోలో బయటకు వచ్చిన స్వామి, తన భార్య సరితకు ఫోన్ చేసి "నన్ను వెతకకండి.. నేను మీకు దొరకను" అని చెప్పి కనిపించకుండా పోయారు.

దీనిపై అప్పట్లోనే బాలనగర్ పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైంది.​ శనివారం కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామ శివారులో రోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, మృతదేహంపై ఉన్న రుద్రాక్ష మాల, కడియం చెప్పుల ఆధారంగా అది స్వామిదేనని ధృవీకరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story