- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA Mahipal Reddy : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని

దిశ, జిన్నారం: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారంలోని రైతు వేదిక లో శనివారం జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ. 21 లక్షల చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






