- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ఒరవడితో 'దిశ' పత్రిక : మంత్రి హరీష్ రావు
'దిశ' పత్రిక కొత్త ఒరవడితో అనతి కాలంలో అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: 'దిశ' పత్రిక కొత్త ఒరవడితో అనతి కాలంలో అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 'దిశ' దిన పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను 'దిశ' జిల్లా ప్రతినిధి తిప్పర్తి భాస్కర్, విలేఖరి వడ్ల కొండ రాముగౌడ్‌తో కలిసి మంత్రి హరీష్ రావు అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'దిశ' పత్రిక కాలంతో పోటీ పడుతూ వార్త కథనాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, అలకుంట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






