దిశ ఎఫెక్ట్ : డ్రైనేజీలు శుభ్రం చేయించిన మున్సిపల్ అధికారులు

by Taduka Kalyani |

నిన్న సాయంత్రం పడిన కొద్దిపాటి వానకే సంగారెడ్డి ప్రధాన రోడ్లన్నీ వర్షపు నీటితో నిండుకుపోయింది. ఈ అంశంపై దిశలో "చిన్నవానకే సంగారెడ్డి చిత్తడి" అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.

దిశ ఎఫెక్ట్ : డ్రైనేజీలు శుభ్రం చేయించిన మున్సిపల్ అధికారులు
X

దిశ, సంగారెడ్డి : నిన్న సాయంత్రం పడిన కొద్దిపాటి వానకే సంగారెడ్డి ప్రధాన రోడ్లన్నీ వర్షపు నీటితో నిండుకుపోయింది. ఈ అంశంపై దిశలో "చిన్నవానకే సంగారెడ్డి చిత్తడి" అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి రైతు బజార్ వరకు రోడ్ల పక్కన చెత్తతో నిండిన డ్రైనేజీలను అన్నింటినీ జేసీబీతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సహాయం తో వాటిని శుభ్రం చేయించారు. ప్రజలు నిర్లక్ష్యంగా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడమే కాకుండా, డ్రైనేజీలో కూడా పారేస్తుండడంతో అవి పూర్తిగా నిండిపోయిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. తద్వారా డ్రైనేజీలు అన్ని జామ్ అయ్యి వర్షపు నీరు అంతా బయటికి వస్తుందని కమిషనర్ దిశతో మాట్లాడుతూ వివరించారు. ఇప్పటికైన పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గమనించి మున్సిపల్ అధికారులకు సహకరించి ఎవరు కూడా చెత్తను డ్రైనేజీ, కాలువల్లో కానీ ఇతర బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఉదయం నుంచి కమిషనర్ దగ్గరుండి ఈ శుభ్రం చేయించే పనులను పర్యవేక్షించారు. ఆయన వెంట చైర్ పర్సన్ వనిత భర్త కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్ ఇతర సిబ్బంది ఉన్నారు.

Next Story