- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'Dharani portal రద్దు చేయాలి'
దిశ, సంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతుల రక్తం తాగుతున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్ పేరుతో 25 లక్షల మంది రైతులు తమ భూములు తమ పేరున రిజస్టార్ కావడం లేదని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి భూముల కోసం తసీల్దార్ కార్యాలయం చుట్టూ ఆర్డీవో కార్యాలయం చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి వైఫల్యాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎక్కువ కాబట్టి ఆ విషయాలు రైతులకు తెలిస్తే రైతులు తెలంగాణలో పార్టీని బొంద పెడతారని గ్రహించి తెలంగాణ రైతుల మధ్యలో విషపు చిమ్మాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఏది చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, మహేందర్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ ,మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్పాండే, గోదావరి అంజిరెడ్డి ,ఎడ్ల రమేష్ ,గిద్దె రాజు , పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్, రవికుమార్ గౌడ్ ,అసెంబ్లీ కన్వీనర్లు ఉదయ్ బాబు , రజనీకాంత్, రాములు, రాజశేఖర్ రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పవన్ కుమార్, యశ్వంత్ , ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Also Read...
- Tags
- dharani portal