- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ హయాంలోనే నారాయణఖేడ్ అభివృద్ధి: మంత్రి హరీష్ రావు
by Taduka Kalyani |
60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ ను అభివృద్ధి చేయలేకపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు.

X
దిశ, నారాయణఖేడ్: 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ ను అభివృద్ధి చేయలేకపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నారాయణఖేడ్ అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. నారాయణఖేడ్ లో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.
తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని, బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రత్యర్థ పార్టీల నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతూ అధికార పార్టీపైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు అండగా నిలిచి మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రత్యర్థ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
Next Story






