బీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూల్చడం పిరికిపంద చర్య : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చడం పిరికిపంద చర్య అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూల్చడం పిరికిపంద చర్య : ఎమ్మెల్యే
X

దిశ, నర్సాపూర్ : కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చడం పిరికిపంద చర్య అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల్లో రోజురోజుకీ పెరుగుతున్న అపారమైన మద్దతును తట్టుకోలేక కొందరు దురుద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్ పార్టీ దిమ్మెను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన, ఖండనీయమైన చర్య అని వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా అవమానపరిచే ఈ ఘటనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందనీ తెలిపారు. దిమ్మెను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, వారి వెనుక ఉన్న ప్రేరేపకులను కూడా బయటపెట్టి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు, ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే, బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story