మ‌తి స్థితిమం లేని వృద్ధారాలు అదృశ్యం

by Ratna Kumari |

మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని పొలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

మ‌తి స్థితిమం లేని వృద్ధారాలు  అదృశ్యం
X

దిశ, చేగుంట : మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వృద్ధురాలు అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని పొలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పొలంప‌ల్లి గ్రామానికి చెందిన కిష్టాపురం పెంటవ్వ (62) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వ‌రు లేని సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బంధువుల వద్ద చుట్టుపక్కల తెలిసిన వారిని సంప్ర‌దించినా ఆచూకీ లభించడం లేదని ఆమె కుమారుడు కిష్టాపురం నరసింహులు చేగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story