ధాన్యం ఆన్లోడ్‌లో జాప్యం.. రైతుల ఆగ్రహం

by Kodari Anjali |

సరైన మ్యాచరు రావడం లేదు అంటూ ధాన్యం కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం ఆన్లోడ్‌లో జాప్యం.. రైతుల ఆగ్రహం
X

దిశ, తూప్రాన్: ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని అని అన్నారు కానీ మనోరాబాద్ మండలం దండుపల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం ప్రస్తుతం ముప్పిరెడ్డిపల్లి గోడౌన్లో అన్లోడ్ చేయడం లేదు. సరైన మ్యాచరు రావడం లేదు అంటూ అధికారులు రైతుల ధాన్యం కొనడం లేదు. అటు తాహసీల్దారుకు గానీ, తెలియజేసిన పట్టించుకోవడం లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులపై అధికారులు, ఇతర పార్టీ నాయకులు స్పందించి రైతుల సమస్యని నెరవేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ధాన్యం అన్లోడింగ్ చేసుకోవడం లేదు అని రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story