ధాన్యం కొనుగోలు ఆల‌స్యం.. రోడ్డెక్కిన రైతులు

by Ratna Kumari |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండ‌లంలోని రేగుల‌ప‌ల్లి గ్రామ రైతులు రాజీవ్ ర‌హ‌దారి పై గురువారం ఆందోళ‌న‌కు దిగారు.

ధాన్యం కొనుగోలు ఆల‌స్యం.. రోడ్డెక్కిన రైతులు
X

దిశ‌, బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండ‌లంలోని రేగుల‌ప‌ల్లి గ్రామ రైతులు రాజీవ్ ర‌హ‌దారి పై గురువారం ఆందోళ‌న‌కు దిగారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డంలో ఆల‌స్యం జ‌రుగుతుండ‌టంతో ఆగ్ర‌హించిన రైతులు రోడ్డు పై కూర్చొని నిర‌స‌న తెలిపారు. రైతులు ర‌హ‌దారి పై బైఠాయించ‌డంతో వాహ‌నాల రాక‌పోక‌లు పూర్తిగా స్థంబించాయి. కొంత‌సేపు ట్రాఫిక్ కి తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న ఎస్సై తోట తిరుప‌తి ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను వినిపించుకున్న ఆయ‌న కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించి స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు త‌మ ఆందోళ‌నను విర‌మించారు. ఈ ఘ‌ట‌న‌తో కొంత సేపు ర‌హ‌దారిపై ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Next Story