- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతి.. గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి
సంగారెడ్డి పట్టణం రాజంపేట కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దిశ, సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి పట్టణం రాజంపేట కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి అస్వస్థకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. తేదీ 28-06-2026 న మధ్యాహ్నం 1.30 గంటలకు రాజంపేట కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పక్కన రోడ్డుపై ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. వివరాలు అడగగా.. తన పేరు మల్లారెడ్డి అని మాత్రమే తెలిపి, మిగతా వివరాలు చెప్పలేకపోయాడు.
చికిత్స పొందుతూ మృతి..
చికిత్స పొందుతున్న క్రమంలో తేదీ 07-07-2026న ఉదయం 10.30 గంటలకు అతను మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 50 నుండి 60 సంవత్సరాలు ఉంటుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు. గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని ఈ విషయాన్ని పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు తెలియజేశారు. పై ఫోటోలోని వ్యక్తిని గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంప్రదించవలసిన నంబర్లు: సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్:8712661830,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్: 8712656718






