వేసవిలో 'జర భద్రం'.. గడ్డి వాములు-నిప్పురవ్వ ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు: ఎస్సై

by Kodari Anjali |

ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి.

వేసవిలో జర భద్రం.. గడ్డి వాములు-నిప్పురవ్వ ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు: ఎస్సై
X

దిశ, సంగారెడ్డి అర్బన్: ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జిల్లా పోలీస్ శాఖ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.

గడ్డి వాములు.. నిప్పురవ్వ.. నిర్లక్ష్యం వద్దు

గ్రామీణ ప్రాంతాల్లో పొలాల వద్ద గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాలు ఉన్న ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. రైతులు తమ పొలాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, గడ్డి వాములు మరియు పొలాల సమీపంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలి, ఎండిన గడ్డి దగ్గర మంటలు వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇళ్ల వద్ద వంటలు చేసి, పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా పనులకు వెళ్లడం వల్ల గాలికి మళ్లీ మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది.

చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్తున్నారా..?

వేసవి కాలంలో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా యువత మరియు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలి, ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే వెళ్లాలి, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు వెళ్లడం చాలా ప్రమాదకరం, మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా నిషేధమని, చెరువులు, కుంటల వద్ద నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.

అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ పరితోష్ పంకజ్

ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళలలో ఇళ్ల బయట లేదా మేడలపై నిద్రించే పరిస్థితులు ఉంటాయని, ఈ సమయంలో దొంగలు అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 100 లేదా 112 నంబర్లకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని సూచించారు.గత సంవత్సరం వేసవికాలంలో జిల్లా7అగ్నిప్రమాదాలు,౫౦ చెరువుల వద్ద 23ప్రమాదాలు జరిగాయని తెలిపారు. కావున ప్రజలందరూ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Next Story