- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోసంద్రంలో కూలిన మృతదేహం లభ్యం..
మెదక్ పట్టణ శివారులోని గోసంద్రంలో కుళ్లిన మృతదేహం గురువారం లభ్యమైంది.

X
దిశ, మెదక్ టౌన్: మెదక్ పట్టణ శివారులోని గోసంద్రంలో కుళ్లిన మృతదేహం గురువారం లభ్యమైంది. మెదక్ పట్టణం పంచముఖి గుడి సమీపంలో గల గోసంద్రంలో తేలిన మృతదేహాన్ని గొర్రె కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కుళ్లిన దశలో మృతదేహం ఉండడంతో మృతి చెంది నాలుగు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఎవరన్నా విషయం తెలిస్తే వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story






