- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధ తండ్రికి.. కూతురు టోకరా
వృద్ధాప్య పింఛన్ కోసం సంతకం చేయాలని చెప్పి మోసపూరితంగా తన వ్యవసాయ భూమిని కన్న కూతురు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఓ వృద్ధుడు ప్రజావాణిలో అర్జీ అందజేశారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వృద్ధాప్య పింఛన్ కోసం సంతకం చేయాలని చెప్పి మోసపూరితంగా తన వ్యవసాయ భూమిని కన్న కూతురు రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఓ వృద్ధుడు ప్రజావాణిలో అర్జీ అందజేశారు. ఎల్లెంకి కిష్టారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలోని సర్వేనంబర్ 251లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. నాలుగో కుమార్తె ఒంటరి మహిళ కావడంతో సదరు భూమిని కేటాయించినట్లు తెలిపారు.
అయితే రెండో కుమార్తె అరుణ వృద్ధాప్య పింఛన్ కోసం సంతకం చేయాలని చెప్పి సిద్దిపేటకు తీసుకెళ్లి, ఆ భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయం తనకు తెలియకుండా సుమారు ఒక సంవత్సరం పాటు తనను వారితో ఉంచుకున్నారని తెలిపారు. విషయం తెలిసిన తర్వాత ప్రశ్నించగా, స్వగ్రామంలో వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. గ్రామస్థులు పిలిచినా వారు స్పందించలేదని తెలిపారు. అనంతరం మేము రెండవ కుమార్తె గ్రామమైన తూప్రాన్‌కు వెళ్లి అడగగా, వారు మాపై కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం పై దర్యాప్తు జరిపి, మోసపూరితంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, భూమిని తిరిగి తన పేరిట మార్చాలని ఎల్లెంకి కిష్టారెడ్డి అధికారులను కోరారు.






