- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ములేనప్పుడు సవాల్ ఎందుకు విసరాలి : నరేందర్ రెడ్డి
గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

దిశ, జిన్నారం : గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక రోజు బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయగా, మరో రోజు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ నాయకుల పై ప్రత్యారోపణలు చేశారు. దీంతో గుమ్మడిదల మున్సిపాలిటీలో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్ నరేందర్ రెడ్డి చేసిన సవాల్ నేపథ్యంలో, సోమవారం ఆయన తన పార్టీ అనుచరులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం తన అనుచర గణంతో ఉదయం 11 గంటలకు రాజీనామా పత్రంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు రాకపోవడం, స్పందించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు కార్యాలయం నుంచి వెనుదిరిగారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చేతగాని బీఆర్ఎస్ నాయకులకు దమ్ములేనప్పుడు సవాల్ ఎందుకు విసిరారని వారు ప్రశ్నించారు. అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. మరోసారి కాటా శ్రీనివాస్‌ను, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మద్ది వీరారెడ్డి, మాజీ సర్పంచ్ సురభి నాగేందర్ గౌడ్, జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






