- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాపర్ బండళ్ల దొంగతనం కేసు ఛేదన.. ఒకరు అరెస్ట్
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్యాల గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ పరిశ్రమలో జరిగిన కాపర్ బండళ్ల దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు.

దిశ, ములుగు: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్యాల గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ పరిశ్రమలో జరిగిన కాపర్ బండళ్ల దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. గత నెల మార్చి 27 రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు పవిత్ర బోరా, అక్కడ నిల్వ ఉంచిన కాపర్ బండళ్లపై కన్నేసి వాటిని దొంగతనం చేయాలని యోచించాడు. ఈ పని కోసం కరకపట్లకు చెందిన స్క్రాప్ వ్యాపారి తరుణ్ కుమార్‌ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి రెండు విడతల్లో కాపర్ బండళ్లను బయటకు తరలించి, స్క్రాప్ షాప్ వద్ద దాచారు. అనంతరం వాటిని విక్రయించేందుకు తరలిస్తున్న సమయంలో కొట్యాల చౌరస్తా వద్ద ములుగు ఎస్సై రఘుపతి, వారి సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తూ తరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. సుమారు రూ.15 లక్షల విలువైన ఏడు కాపర్ బండళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని కేసును త్వరగా సేదించినందుకు మర్కుక్ ఎస్సై దామోదర్‌ను ములుగు ఎస్సై రఘుపతిని గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు అభినందించారు.






