- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త డ్రామా..!
దిశ, కొమురవెల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా గుర్తుకు రాని మహిళలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని కొమురవెల్లి మండల బీఆర్ఎస్ సీనియర్

దిశ, కొమురవెల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా గుర్తుకు రాని మహిళలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని కొమురవెల్లి మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ ఓట్ల కోసం చీరల పంపిణీ చేపట్టిందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగకు ఆడపడుచులను గౌరవించి చీరెలు పంపిణీ చేశారని గుర్తుకు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే అని మరోమారు మహిళలను మోసం చేసి కుట్ర చేస్తుందని తెలిపారు. మహిళలకు ప్రతి నెల రూ.2500 రూపాయలు, ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, బాలిక విద్యార్థులకు స్కూటీలు అంటూ ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని మభ్యపెట్టి మళ్లీ మహిళలను మోసం చేస్తున్నారని, అన్ని వర్గాల మహిళలకు చీరల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.






