బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు

by Bhanu |

డ‌ప్పూర్ గ్రామానికి చెందిన 20మంది కాగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు బీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు ర‌వీంద‌ర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు
X

దిశ‌, న్యాల్క‌ల్: మండ‌ల ప‌రిధిలోని డ‌ప్పూర్ గ్రామానికి చెందిన 20మంది కాగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు బీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు ర‌వీంద‌ర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన శ్రీకాంత్ యాదవ్, సిహెచ్ రజినీకాంత్, బస్వరాజ్ ముదిరాజ్, రవి యాదవ్, దత్తు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గోపాల్ రెడ్డి, సుభాష్ త‌దిత‌రుల‌కు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంత‌రం ఆయ‌న మాట్టాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలపై విరక్తి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యపడుతుందని వెల్లడించారు. స‌ర్పంచ్ ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు దారులు పెద్ద సంఖ్యలో విజయకేతనం ఎగరవేస్తారని అన్నారు. అందుకు బీఆర్ ఎస్ పార్టీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ను గెలిపించేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story