- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు జోరు కాంగ్రెస్ బేజారు..!
దిశ, సంగారెడ్డి అర్బన్ : గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కారు జోరు కాంగ్రెస్ బేజారు ల కనిపిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కారు జోరు కాంగ్రెస్ బేజారు ల కనిపిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను అభినందిస్తూ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేసులు డబ్బు గుండాయిజం ప్రయోగించిన బీఆర్ఎస్ 40 శాతం 4 వేల పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకొని తన సత్తా చాటింది అన్నారు. ఇకపోతే ఈ ఫలితాలు చూస్తుంటే.. తప్పకుండా రెండు ఏళ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పక్క రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాపులు, మ్యాపుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మనవడి సోకుల కోసం 100 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడిస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రైసింగ్ సీఎం కాదని ఢిల్లీకి హైదరాబాద్ కి చెక్కర్లు కొట్టే ఫ్లయింగ్ సీఎం గా మారారని విమర్శించారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90% గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయని, కానీ బీఆర్ఎస్ 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలిచిందని చెప్పారు. సంగారెడ్డిలో 34 సర్పంచ్ స్థానాలను గెలిస్తే 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులు కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారని అన్నారు. ఇకపోతే రాజకీయాల్లో అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీ 50 శాతం లోపే సర్పంచులు గెలిస్తే 66% గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 10 నుంచి 12 స్థానాలు గెలవడం గొప్ప అన్నారు. రైతుల కష్టం తెలువని ముఖ్యమంత్రి ఎక్కడా లేడని, కెసిఆర్ హయాంలో కరెంటు ఫుల్ నీళ్లు ఫుల్ ఎరువులు ఫుల్లుగా ఉండేవని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టారని, కరెంటు 14 గంటలు కూడా వస్తలేదని ఎరువుల కోసం లైన్ లో నిలబడి రైతులు గోసపడుతున్న దృశ్యాలు రేవంత్ రెడ్డి పనితీరును చెప్పకనే చెబుతుందన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల లారీలు ఊర్లకే పంపి రైతులకు అందించడం జరిగిందని అన్నారు. మున్సిపాలిటీల సమయం అయిపోయి సంవత్సరం అవుతున్నా కూడా ఇంకా ఎన్నికలు పెట్టడం లేదని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదో రేవంత్ రెడ్డికి తెలియాలన్నారు. కేవలం ఓడిపోతామని భయంతోనే ఎన్నికలకు ముందు రావడం లేదన్నారు. కో ఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కాంగ్రెస్ నాయకులకు నామినేట్ చేసుకుందామని జీవో ఇవ్వడం సరికాదన్నారు. మరికొన్ని రోజుల్లో సర్పంచ్ లకు ఎలా పనిచేయాలో అనే పూర్తి విషయాలను తెలియజేస్తూ ప్రత్యేకంగా నియోజకవర్గంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇకపోతే ఓడిపోయిన వారికి భవిష్యత్తు ఉంటదని గెలిచిన వారికి మాత్రం బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఎదిగిన కొద్దీ ఎదగాలని ఓపికతో ఉండాలని ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు సాగాలని గెలిచిన సర్పంచులకు, ఉపసర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఆయన సూచనలను చేశారు. రేవంత్ రెడ్డి ఆయన మనవడి సోకు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఏమిటని, సింగరేణి కార్మికుల 10 కోట్ల డబ్బును ఫుట్బాల్ మ్యాచ్ కు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. 4000 పింఛను ఇంకా ఇవ్వడం లేదని, మహిళలకు 2500 మాట ఊసే లేదని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి కొండల్ రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, నాయకులు మ్యకం విట్టల్, మధుసూదన్ రెడ్డి ,చక్రపాణి, వెంకటేశ్వర్లు ,నరసింహులు, మల్ల గౌడ్ పాల్గొన్నారు.






