- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్ధిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు
సిద్దిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం అంశం.. ఫిర్యాదులు.. విచారణ.. విందు భోజనం అన్న చందంగా సాగుతుందా అంటే ప్రజల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం అంశం.. ఫిర్యాదులు.. విచారణ.. విందు భోజనం అన్న చందంగా సాగుతుందా అంటే ప్రజల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై అధికారులు విచారణ తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట మున్సిపాలిటీకి 2022లో తెలంగాణ సమైక్యత వజ్ర ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రెవెన్యూ శాఖ ద్వారా రూ.30 లక్షలు (రూ.7.50 లక్షలు, రూ.15 లక్షలు చెక్ ల రూపేనా, రూ.7.50 లక్షల నగదు రూపేణ) నిధులు విడుదలైనట్లు ఓ కౌన్సిలర్ ఆర్టీఏ దరఖాస్తుకు అధికారులు సమాధానం ఇచ్చారు. కాగా.. మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా టెబుల్ ఎజెండాలోని 8వ అంశంలో రూ.22.50 లక్షల నిధులు విడుదలైనట్లు పేర్కొని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశ పెట్టి, అదే అంశాన్ని మినిట్స్ బుక్ లో సైతం పేర్కొన్నట్లు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెల్లడించారు. మిగిలిన రూ.7.50 లక్షలు ఎజెండాలో చూపకుండా గోల్ మాల్ చేసినట్లు ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సిద్దిపేట అర్బన్ తహసీల్దార్, సిద్దిపేట మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు విచారణ చేసి సంబంధిత రికార్డుల జిరాక్స్ కాఫీలను తీసుకెళ్లారు. తదనంతరం సిద్దిపేట అర్బన్ తహాసీల్దార్ గా విధులు నిర్వహించిన నాటి అధికారిని, మున్సిపల్ కార్యాలయాల సిబ్బందిని, ఓ కౌన్సిలర్ స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. ఇది లా ఉంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, టెండర్ లేదా బాక్స్ టెండర్, కాంట్రాక్టర్ పేరు లేకుండా, వర్క్ ఆర్డర్ కాంట్రాక్టర్ కు ఇవ్వకుండా, ఎంబీ రికార్డ్ చేయకుండా మున్సిపల్ కమిషనర్ చాంబర్ రీన్నోవేషన్, బాక్స్ టెండర్ల పేరిట ఇష్టాను సారంగా లక్ష రూపాయల లోపు 140 చెక్కులు విడుదల చేసిన విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఓ మున్సిపల్ కౌన్సిలర్ కుమారుడు కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై గత నెలలో రిజనల్ డైరెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తో పాటుగా, ఫిర్యాదు చేసిన వ్యక్తిని విచారించారు. తెలంగాణ సమైక్యత వజ్ర ఉత్సవాల నిధుల దుర్వినియోగం, మున్సిపల్ కమిషనర్ చాంబర్ రీన్నోవేషన్ అంశం లో ఉన్నతాధికారుల నివేదిక చర్యల అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.






