- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ సాబ్ సెల్యూట్..! అర్ధరాత్రి ఆసుపత్రుల విజిట్
వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

దిశ, మెదక్ ప్రతినిధి: వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఎక్కడ లేని విధంగా తెల్లవారుజామున స్వయంగా కలెక్టర్ వెళ్లి ఆసుపత్రులు తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించడం జిల్లాలోనే ప్రప్రథమం. పగటి పూటనే వైద్యులు అందుబాటులో ఉండరన్న పేరొచ్నిన వైద్య శాఖలో అందుబాటులో ఉండి సేవలు అందించడం పై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చలవే అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తం అవుతోంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ పని వేళల్లో వైద్య ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో అర్బన్ హెల్త్ సెంటర్ కు ఆదివారం వెళ్లి తాళం తీసి వైద్యులకు విధుల డుమ్మాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అర్బన్ కేంద్రంలో పనివేళల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. కొల్చారం మండలంలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన విధులకు గైర్హాజర్ ఆయన ఇద్దరు అధికారుల పై చర్యలు తీసుకున్నారు. నెలలో ప్రతివారం ఏదో ఒక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిరోగులకు వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న మాత శిశు ఆరోగ్య కేంద్రం తో మెడికల్ కళాశాలలో కూడా పరిశీలన చేస్తున్న సంగతి తెలిసిందే.
అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు
సమాజం అంతా నిద్రలో ఉన్నప్పుడు అత్యవసరం వైద్యమే. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యులు అందుబాటులో లేకుండా రోగుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందులో పేదలు ఉంటే ప్రైవేట్ కు వెళ్లలేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అందులో జిల్లాలో 24గంటల పాటు వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 1:30 గంటలకు వెళ్లి వైద్య సేవలు తనిఖీ చేశారు. రాత్రి డ్యూటీ డాక్టర్ ఎవరున్నారు..? స్టాఫ్ పూర్తి స్థాయిలో వచ్చారా..? అనే వివరాలపై అరా తీశారు. అప్పుడే పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ప్రసవం జరిగే వరకు ఆసుపత్రిలో ఉంది వైద్య సేవలను పరిశీలించారు. కౌడిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలపై కూడా పరిశీలించారు. వైద్య సిబ్బంది, మెడిసిన్ కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.
కలెక్టర్‌పై ప్రశంసలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పేదలకు పక్కగా అందాలంటే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటేనే సాధ్యం అవుతోంది. కానీ గతంలో పగటి పూటనే సిబ్బంది గైర్హాజర్ కావడం, అందుబాటులో వైద్యులు ఉండకపోవడం వల్ల రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడేవారు. గంటల పాటు వేచి ఉండడంతో అనేక ఇబ్బందులు పడి చివరకూ ప్రైవేట్ బాట పట్టేవారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వచ్చిన తరవాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పు వచ్చింది. జిల్లా కలెక్టర్ గా ఏడాది పాలన పూర్తయిన కలెక్టర్ వైద్యంపై ప్రత్యేక మార్క్ వేశారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది పక్కగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిల్లో మార్పు తీసి వచ్చారు. ఇక ఏకంగా అర్థరాత్రి ఆసుపత్రులు తనిఖీ చేసి చేసి పేదల వైద్యంపై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను మరోమారు చాటారు. అందుకే జిల్లా ప్రజలు రాహుల్ రాజ్ ను కొనియాడుతున్నారు.






