ప‌దోత‌ర‌గ‌తిలో మంచి ఫ‌లితాలు సాధించి జిల్లా ప్ర‌తిష్ట పెంచాలి : క‌లెక్ట‌ర్ ప్రావీణ్య

by Ratna Kumari |

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు మంచి ఫ‌లితాలు సాధించి జిల్లా ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య సూచించారు. గురువారం కంది మండ‌లం చేర్యాల గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్

ప‌దోత‌ర‌గ‌తిలో మంచి ఫ‌లితాలు సాధించి జిల్లా ప్ర‌తిష్ట పెంచాలి :  క‌లెక్ట‌ర్ ప్రావీణ్య
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు మంచి ఫ‌లితాలు సాధించి జిల్లా ప్ర‌తిష్ట‌ను పెంచాల‌ని క‌లెక్ట‌ర్ పి.ప్రావీణ్య సూచించారు. గురువారం కంది మండ‌లం చేర్యాల గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను ఆమె ఆక‌స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనా పద్ధతులను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులను సెలబస్ ఎంతవరకు పూర్తయింది, రెగ్యులర్, ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు బాగా నిర్వహిస్తున్నారని, చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులందరికీ ప్రతిరోజూ స్నాక్స్ అందుతున్నాయా, మిడ్‌డే మీల్ నాణ్యత ఎలా ఉంది..? అనే విషయాలపై ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీసారు. పాఠశాల హాజరు శాతం, పదవ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్, మాక్ టెస్టులు ఎంతవరకు నిర్వహిస్తున్నారన్న అంశాలను ప్రత్యేకంగా సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మరింత క్రమశిక్షణతో చదువుకోవాలని కలెక్టర్ సూచించారు . ఈసారి మంచి మార్కులు సాధించి పాఠశాల పేరును, జిల్లా పేరును ఉన్నతంగా నిలబెట్టాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన అకాడమిక్ సపోర్ట్ అందించాలని సూచించారు.

Next Story