- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రమాదంలో గాయపడ్డ తిరభి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు

దిశ, సంగారెడ్డి: ప్రమాదంలో గాయపడ్డ తిరభి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు. బుధవారం గాయపడ్డ కార్మికులను ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కిర్భీ కంపెనీ ఇంద్రేశం రూట్ బస్సు ఫస్ట్ షిఫ్ట్ కార్మికులను డ్యూటీకి తీసుకెళ్తుండగా కర్దానూర్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి పాశమైలారం రోడ్డు మార్గంలో లారీ బస్సు డికొనడంతో ప్రమాదం జరిగింది 32 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందని వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్లతో పరిశ్రమ యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇక్కడ అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోతే ఇతర హాస్పిటల్‌కు తీసుకుపోయి మంచి వైద్యం అందించాలని అన్నారు. కార్మికులకు వారి కుటుంబ సభ్యులతో అధైర్యపడవద్దని అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదం చాలా బాధాకరమని గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని అన్నారు. ప్రమాదం జరిగిందని తెలవగానే సిఐటియు యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రాజు, తలారి శ్రీనివాస్, నాగప్రసాద్ ఆఫీస్ బేరర్స్ కార్మికులను అంబులెన్స్‌లో హాస్పిటల్స్‌కు తీసుకవచ్చే ఏర్పాట్లు చేసి వైద్యం పూర్తిస్థాయిలో అందే విధంగా పర్యవేక్షణ చేశారు.
ఐదు మందిని అబ్జర్వేషన్లు ఉంచినారు మిగతా కార్మికులను వైద్యం అందించి ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. చుక్క రాములుతో పాటు యాజమాన్యం ప్రతినిధులు ఫిల్బోస్, రాజమహేందర్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అతిమేల మానిక్, సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, పి. పాండురంగారెడ్డి, సిఐటియు సీనియర్ నాయకులు వాజిద్ అలీ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రాజు ఆఫీస్ బేరర్స్ హెచ్ఆర్ రాహుల్ నాగరాజు తదితరులు ఉన్నారు.
- Tags
- medak






