చిర్ర గోనె టోర్నమెంట్ ప్రారంభం : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

గ్రామీణ ప్రాంతాల్లో అంతరించి పోయిన ఆటలను నేటి తరానికి అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

చిర్ర గోనె టోర్నమెంట్ ప్రారంభం : ఎమ్మెల్యే
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో అంతరించి పోయిన ఆటలను నేటి తరానికి అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట లో చిర్ర గొనె టోర్నమెంట్ ను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నాడు వాలీబాల్, చిర్ర గొనె, కోకో, లాంటి ఆటలు ఎన్నో ఆడేవాళ్లమని, శారీరకంగా, ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేవన్నారు. నేటి తరం అన్ని ఆటలు ఫోన్ లోనే ఆన్ లైన్ లోనే ఆడుతున్నారని దాని వలన చిన్నప్పటి నుంచే వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు. అలాంటి అంతరించిపోయిన చిర్ర గొనె ఆటను మళ్ళీ గుర్తు చేయడం నేటి తరానికి తెలియ జేయడం సంతోషంగా ఉందని ఈ టోర్నమెంట్ ను నిర్వహించిన నిర్వహాకులకు అభినందనలు తెలిపారు.

Next Story