తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం : ఎమ్మెల్యే చింతా

by Naveena |   (  Updated:2024-12-09 16:48:11  IST  )

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఆవిష్కరించడం దురదృష్టకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.

తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం :  ఎమ్మెల్యే చింతా
X

దిశ, సంగారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఆవిష్కరించడం దురదృష్టకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో 02.06.2015 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పటి మంత్రి తన్నీరు హరీష్ రావు , ఎమ్మెల్యేగా చింత ప్రభాకర్, అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా ,అప్పటి అందోల్ ఎమ్మెల్యే బాబు మోహన్, అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. కానీ ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ వారి కుసంస్కారానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమ ప్రారంభం తర్వాత తెలుగు తల్లి సెంటిమెంట్, ఆంధ్ర పాలకులు ప్రస్తావించేవారు. ఎవరి తల్లి -తెలుగు తల్లి..అంటూ కేసీఆర్ అడిగేవారన్నారు. ఉద్యమ సమయంలో బీఎస్ రాములు తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారన్నారు.

కేసీఆర్ ఒక్కరే ఏకపక్షంగా తెలంగాణ తొలి విగ్రహాన్ని రూపొందించలేదని, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నారని, సుసంపన్న తెలంగాణకు చిహ్నంగా ఉండాలని రూపొందించారన్నారు. తెలంగాణ తల్లి ఒకే సైజులో ఉండాలని ఒకే రూపంలో ఉండాలని కేసీఆర్ నిర్ణయించారని, ఇలా తయారుచేసిన తొలి విగ్రహం 17. 11. 2007 తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆవిష్కరించారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో అన్ని నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమం వ్యాప్తిలో ఎంతో దోహదపడిందన్నారు. మీరు చాటుగా ఒక విగ్రహాన్ని తయారుచేసి ఇదే తెలంగాణ తల్లి అంటున్నారని, ప్రజలు మిమ్మల్ని నమ్మరని చింతా ప్రభాకర్ అన్నారు. అప్పటి ఫొటోలను గుర్తు చేస్తూ ఫొటోలను విడుదల చేశారు.

Next Story