- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి గండి పెట్టేందుకు చూస్తుంది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి
ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి తెలిపారు.

దిశ, ములుగు : ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి పర్యటించి ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల ప్రగతి, కూలీల హాజరు, వేతనాల చెల్లింపులపై వివరాలు తెలుసుకుని, కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో వేతనాల ఆలస్యం, పనుల లోపాలపై కూలీలు వ్యక్తం చేసిన ఆందోళనలను ఆమె గమనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గండి పెడుతోందని ఆరోపించారు. గ్రామీణ పేదల జీవనోపాధికి కీలకమైన ఈ పథకాన్ని బలహీనపరచడం సరైంది కాదని పేర్కొన్నారు. అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలకు తగిన మంచినీటి సౌకర్యం కల్పించి, టెంట్లు ఏర్పాటు చేసి ఎండ నుంచి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కడప జిల్లా నర్సింహారెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తమ్మల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.






