- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి గ్రామంలో మైనంపల్లి రోహిత్ కే మద్దతు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడడంతో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు.

దిశ, నిజాంపేట : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడడంతో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ విజయం సాధించారు. దీంతో నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న కాలంలో మెదక్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేసింది ఏమి లేదని నూతన మండలం ఏర్పడి తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ బస్టాప్ కూడా నోచుకోలేని స్థితిలో నిజాంపేట మండలం ఉందని వారు హెగ్డేవా చేశారు. మైనంపల్లి రోహిత్ నిజాంపేటను ఎంతగానో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, మారుతి, వెంకట్ గౌడ్, గుమ్ముల అజయ్, మ్యాదరి నర్సింలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






