- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
by Ratna Kumari |
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు.

X
దిశ, చేర్యాల : ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. చేర్యాల మండల పరిధిలోని వీరన్నపేట, గుర్జకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన 12 కెమెరాలను ఏసీపీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, నేరస్థులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గ్రామాల్లో యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి, గ్రామ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






