ఫార్మసీ విద్యకు ఉజ్వల భవిష్యత్ : రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. మదుసుధన్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, కొండ‌పాక : దేశంలో ఫార్మసీ విద్యకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని కరీంనగర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ రిటైర్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. మదుసుధన్ రెడ్డి అన్నారు. శనివారం కొండపాక మండలంలోని

ఫార్మసీ విద్యకు ఉజ్వల భవిష్యత్ : రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. మదుసుధన్ రెడ్డి
X

దిశ‌, కొండ‌పాక : దేశంలో ఫార్మసీ విద్యకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని కరీంనగర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ రిటైర్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. మదుసుధన్ రెడ్డి అన్నారు. శనివారం కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామా శివారులో ఉన్న శ్రీకృప ఫార్మసీ కళాశాలలో నూతన ఫార్మసీ విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. మఖ్యఅథితి గా ఆయన హాజ‌రై మాట్లాడారు. ఫార్మసీ విద్యకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన దేశంలోనే కాకుండా కొవిడ్‌ అనంతరం పరిణామాల్లో ఫార్మసీ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. విద్యార్థులు శ్రద్దతో చదివి నైపుణ్యం పెంపోందించుకుంటే ఉద్యోగం తప్పకుండా ల‌భిస్తుంద‌ని తెలిపారు. కార్యక్రమం లో కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ వి.మల్లారెడ్డి , ప్రిన్సిపల్ డా.ఎన్ మంజునాధ్, డా. గణేష్ పాల్గొన్నారు

Next Story