- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మెదక్ > BREAKING: సంగారెడ్డి జిల్లాలో పోలీసుల తనిఖీలు.. భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టివేత
BREAKING: సంగారెడ్డి జిల్లాలో పోలీసుల తనిఖీలు.. భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టివేత
by Kema Shiva Kumar |
నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలా అందిన కాడికి దోచుకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 280 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అయితే, ఆ బియ్యం సికింద్రాబాద్ నుంచి గుజరాత్ తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బియ్యంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






