పెళ్లిళ్లకు బ్రేక్..!

by Ratna Kumari |

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడికి తాత్కాలిక విరామం ఏర్పడింది. అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) ప్రారంభం కానుండటంతో మే 15 నుంచి జూన్ 18 వరకు 36 రోజుల పాటు వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించరాదని పండితులు చెబుతున్నారు.

పెళ్లిళ్లకు బ్రేక్..!
X

దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడికి తాత్కాలిక విరామం ఏర్పడింది. అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) ప్రారంభం కానుండటంతో మే 15 నుంచి జూన్ 18 వరకు 36 రోజుల పాటు వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించరాదని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లాలోని జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జోగిపేట్ ప్రాంతాలలో భారీ సంఖ్యలో వివాహాలు జరగగా, శుభముహూర్తాలు ముగియనున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల పెళ్లిళ్ల సందడి కనిపించింది.

అధికమాసం ప్రారంభం కావడంతో ఇక పై శుభకార్యాలకు విరామం ఉండనుంది. అధికమాసం ముగిసిన తర్వాత జూన్ 19 నుంచి తిరిగి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. దీంతో మళ్లీ పెళ్లిళ్ల జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శుభకార్యాలు నిలిచిపోవడంతో పలు వృత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్, బట్టల దుకాణాలు, బంగారం వ్యాపారులు, కిరాణా, క్యాటరింగ్, లైటింగ్, డెకరేషన్, షామియానా, టైలర్లు, వాయిద్య కళాకారులు, పూల వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్స్ తదితర రంగాలకు చెందిన కార్మికులకు ఉపాధి తగ్గే అవకాశం ఉంది.

Next Story