ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బోర్ వెల్ బండి..

by Kodari Anjali |

నర్సాపూర్ పట్టణంలో ఆర్టీసీ బస్సును బోర్ వెల్ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బోర్ వెల్ బండి..
X

దిశ, నర్సాపూర్: ఆర్టీసీ బస్సును బోర్ వెల్ వాహనం ఢీ కొట్టిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి నుండి గజ్వేల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండ్ లోపలికి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుండి వస్తున్న బోర్ వెల్ వాహనం, బస్సు పక్క బాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Next Story