- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతుల ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలి : హరీశ్ రావు
నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

దిశ, సంగారెడ్డి : నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం సదాశివరావుపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచారం ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రికి చెత్త సేకరణ కూడా చేతగాని దద్దమ్మ అని మండిపడ్డారు. రెండేళ్లలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారులకి వస్తుందని, అప్పుడు సదాశివపేటకు స్పెషల్ ప్యాకేజీ తెచ్చి మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్రస్ ఎవరికి తెలియదని, కానీ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇల్లు ఆటో వాడిని అడిగినా కూడా చూపిస్తాడని అన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. హామీల పేరుతో జనాలకు 'సున్నం' పెట్టిన రేవంత్ రెడ్డి కావాలా? అని ఆయన ప్రశ్నించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు 5 ఎకరాల చొప్పున స్మశాన వాటికలు ఇచ్చింది బీఆర్ఎస్ అనేది ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. రెండున్నరేళ్లలో ఒక్కో అవ్వతాతకు కాంగ్రెస్ రూ. 52,000 బాకీ పడిందనీ, ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పండి అని అడిగారు.
బస్సు తప్ప మిగతాదంతా తుస్సు, భార్యకు ఫ్రీ టికెట్ అని, భర్తకు డబల్ రేట్లు బాధడం చాలా బాధాకరమన్నారు. కేసీఆర్ రూ. 2000 పెన్షన్ ఇస్తే, రేవంత్ రెడ్డి రూ. 4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడనీ, ఆ డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడిగే హక్కు మీకు వారికి ఉంటుందన్నారు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ లక్ష ఇస్తే.. తులం బంగారం ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్కరికైనా ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చొరవతో రూ. 37 కోట్లతో మిషన్ భగీరథ తెచ్చి రోజుకోసారి నీళ్లు వచ్చేలా చేశామని, 50 పడకల ఆసుపత్రి కట్టించామని, బస్టాండ్ ను బాగుచేశామని, ఊబ చెరువు, కందకండ్ల రోడ్డు, గల్లీల్లో మోరీల కోసం రూ. 25 కోట్లు ఇచ్చి అభివృద్ధి తమ హయాంలో చేశామన్నారు. కాగా మొత్తంగా రూ. 284 కోట్లతో సదాశివపేటను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. హామీల గురించి అడిగితే లాగుల తొండలు వదులుతా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని, సంగారెడ్డిలో రూ. 20 కోట్లతో మైనార్టీ స్కూల్ ఏర్పాటు చేసింది కూడా తమేనన్నారు. షాదీ ముబారక్, ఇమామ్ లకు గౌరవ వేతనం ఇచ్చింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి రంజాన్ తోఫా బంద్ చేశాడన్నారు. ముస్లింలకు రూ. 4000 కోట్లు ఇస్తానని మోసం చేశాడన్నారు. మాకు ఓటేస్తేనే అభివృద్ధి చేస్తాం అని కాంగ్రెస్ వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ, మున్సిపాలిటీలకు వచ్చే నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి జనాభా ప్రాతిపదికన నేరుగా వస్తాఉన్నారు. అవి రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేవి కావన్నారు. ఇప్పుడు వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎలాగూ వస్తాయి, కానీ, రెండేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు సదాశివపేటకు స్పెషల్ ప్యాకేజీ తెచ్చి, మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది, చింతా ప్రభాకర్ ది అన్నారు. సదాశివపేట అభివృద్ధి ఆగకూడదన్నా, పేదలకు సంక్షేమం అందాలన్నా, కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.






