- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిస్లరీ పరిశ్రమ
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిస్లరీ ఇంటర్నేషనల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు డిమాండ్ చేశారు.

దిశ, పటాన్ చెరు టౌన్ : కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిస్లరీ ఇంటర్నేషనల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, యూనియన్ను గుర్తించి వేతన ఒప్పందం చేయాలని బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. ఐదు మంది కార్మికులను చట్ట విరుద్ధంగా డిస్మిస్ చేసిన వారిని తక్షణమే డ్యూటీ లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు గురువారం నుండి సమ్మెలోకి వెళ్లారు. ఉదయం 6 గంటల నుండి బిస్లరి పరిశ్రమ వద్ద కార్మికులు ఆందోళన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మానిక్ మాట్లాడుతూ పాశమైలారం పారిశ్రామిక వాడలో గల బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల్లో కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చెసుకోవడాని యాజమాన్యం సహించలేక కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. యాజమాన్యం మొండివైఖరి విడనాడి తక్షణమే అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను డ్యూటీలో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం యూనియన్ తో చర్చించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు యూనియన్ జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి నాయకులు ప్రవీణ్ సతీష్ నవీన్ నాగరాజు రాము అజయ్లు పాల్గొన్నారు..






