- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన బిల్ కలెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టపడ్డాడు సదాశివపేట బిల్ కలెక్టర్. తన ఇంటి ఆస్తి పన్నును అతను రెగ్యులర్ గా చెల్లించలేదు.

దిశ, సంగారెడ్డి / సదాశివపేట : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టపడ్డాడు సదాశివపేట బిల్ కలెక్టర్. తన ఇంటి ఆస్తి పన్నును అతను రెగ్యులర్ గా చెల్లించలేదు. తీరా చూస్తే.. ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను లక్షకు పైగా దాటింది. అధికారులు ఏమైనా తగ్గిస్తే తాను తక్షణమే ఆ సొమ్మును కట్టేస్తానంటూ మున్సిపల్ కార్యాలయంలో పని చేసే బిల్ కలెక్టర్ ను ఆశ్రయించాడు. అది ఎంత పని లంచం ఇస్తే.. తగ్గిచేస్తానంటూ అతడు హామీ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో ఆ బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న నిఖిల్ రెడ్డి వద్దకు ఓ బాధితుడు వచ్చాడు. తన ఇంటికి సంబంధించిన టాక్స్ డబ్బులు గతంలో రూ. 41 వేలు ఉండేది. ప్రస్తుతం అది కాస్త రూ.1,0,4000/- కావడంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేనని బాధితుడు మొరపెట్టుకున్నాడు.
రూ.50 వేలకు ఇంటి పన్ను తగ్గిస్తానని దానిపై తనకు రూ.35 వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కొద్ది రోజుల కిత్రం రూ.20 వేలు లంచం కింద మొదటి విడతగా నగదును అందజేశాడు. గురువారం సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అదే బాధితుడి వద్ద నుంచి మరో రూ.15 వేలు లంచం తీసుకుంటూ నిఖిల్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఈ వ్యవహారంలో బిల్ కలెక్టర్ పాత్ర మాత్రమే ఉన్నదా..? లేక ఇతర అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు, బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్ స్పెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






