ట్రాఫిక్ నియంత్రణకు పెద్దపీట

by Ratna Kumari |

దిశ, జహీరాబాద్ : ఓ పక్క ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు చేపట్టిన పోలీసులు మరోపక్క జహీరాబాద్ ప్రాంతాన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు

ట్రాఫిక్ నియంత్రణకు పెద్దపీట
X

దిశ, జహీరాబాద్ : ఓ పక్క ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు చేపట్టిన పోలీసులు మరోపక్క జహీరాబాద్ ప్రాంతాన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అవసరం ఉన్న ప్రతి చోట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు కొత్తగా అవసరం ఉన్న మరికొన్ని ప్రాంతాలలో సీసీల ఏర్పాటుకు పూనుకున్నారు. మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు , కూడళ్లలో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిన పోలీసులు దత్తగిరి కాలనీ "టీ " జంక్షన్ వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో నాలుగు చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఇదివరకే పట్టణంలో ప్రధాన రహదారిపై బస్టాండ్ తో పాటు భవాని మందిర్ క్రాస్ రోడ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతాలలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పోలీసులు ఇదివరకే ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. దీంతో పట్టణం సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ లో చేరింది. జహీరాబాద్ పోలీసుల మెరుగైన పనితీరు వారు చేపట్టిన చర్యలు అద్దం పడుతున్నాయి. అక్రమణాలకు తోడు కుచించకపోయిన రోడ్లతో దత్తగిరి కాలనీ రోడ్డుతో పాటు "టీ" జంక్షన్ ప్రమాదకరంగా ఉండేది. మున్సిపల్ అధికారుల సహకారంతో అక్రమణాల తొలగింపుతో పాటు టీ జంక్షన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. అటుపిమ్మట సిగ్నల్స్ ఏర్పాటు చేసి స్థానికుల మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం సిగ్నల్స్ ని అనుసరిస్తూ ప్రయాణికులు రాకపో కొనసాగిస్తున్నారు.

అధికారులు సైతం పెట్రోలింగ్..

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు ప్రభావం ఎక్కువగా ఉన్న జహీరాబాద్ పట్టణానికి ఎక్కువ మంది పోలీసు సిబ్బంది అవసరం ఉంది. సరిపోను సిబ్బంది లేకపోయినప్పటికీ ఉన్న సిబ్బందితోనే డీఎస్పీ. సైదా, సీఐ. శివలింగంతో పాటు ఎస్ఐ. వినయ్ కుమార్ ఇతర ఎస్ఐ లు, సిబ్బంది రాత్రుల్లో పెట్రోలింగ్ విధులు నిర్వహించడం గమనార్వం. అదేవిధంగా టాస్క్ ఫోర్స్, మొబైల్స్ వా హనాలు సైతం ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల తరలింపు, దొంగతనాల నిర్మూలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయినప్పటికీ అనుకోని సంఘటనలు చేసుకోవడం శోచ‌నీయం.

హ్యాకర్లు సహాకారించాలి

పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో స్థానికులు, హాకర్లు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎస్పీ. సైదా, సీఐ. శివలింగంతో పాటు ఎస్ఐ. వినయ్ కుమార్ కోరుతున్నారు. తోపుడు బండ్లను రోడ్డుపై పెట్టుకోకుండా ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని వారు కోరారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సైడ్లలో వాటిని పెట్టుకోవాలని సూచించారు. రహదారిపై బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి నిరోధక చర్యలు చేపట్టి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు.

Next Story