- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్గవ్ మృతదేహం లభ్యం
by Kema Shiva Kumar |
స్నేహితులతో కలిసి అర్బన్ పార్కు లో సరదాగా గడిపేందుకు వచ్చి స్థానిక చెరువులో పడి గల్లంతైన భార్గవ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది.

X
దిశ, నర్సాపూర్: స్నేహితులతో కలిసి అర్బన్ పార్కు లో సరదాగా గడిపేందుకు వచ్చి స్థానిక చెరువులో పడి గల్లంతైన భార్గవ్ మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన భార్గవ్ (22) బోరబండ ప్రాంతానికి చెందిన అన్నం షరీన్ స్నేహితులు సోమవారం నర్సాపూర్ సమీపంలోని అడవిలో ఉన్న అర్బన్ పార్కు ను చూసి నూతనంగా నిర్మిస్తున్న కాటేజీ సమీపంలో చెరువులోకి దిగారు. ఈ క్రమంలోనే భార్గవ్ కు చెరువు లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి గల్లంతయ్యాడు. భార్గవ్ కోసం సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో మంగళవారం గాలింపు చేపట్టగా భార్గవ్ మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
Next Story






