ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : ఆర్డీఓ జ‌య‌చంద్రారెడ్డి

by Ratna Kumari |

ప్రజలతో మమేకమై వారి ఇబ్బందులను ఎల్లప్పుడూ గ్రహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఓ జయ చంద్రారెడ్డి అన్నారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి : ఆర్డీఓ జ‌య‌చంద్రారెడ్డి
X

దిశ, తూప్రాన్ : ప్రజలతో మమేకమై వారి ఇబ్బందులను ఎల్లప్పుడూ గ్రహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఓ జయ చంద్రారెడ్డి అన్నారు. వార్డు సభ్యుల శిక్షణ రెండో విడత మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి లో నిర్వహించారు. ఐదు రోజులు జరుగనున్న ఈ శిక్షణ రెండో విడత కార్యక్రానికి మొదటి రోజు స్పెషల్ అధికారిగా ఆర్డీఓ వచ్చి వార్డు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి వార్డులో పరిశుభ్రత, శానిటేషన్ ఇతర అభివృధి పనులను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలతో కలిసి పని చేయాలని సూచించారు. ఇన్ చార్జి ఎంపీడీఓ కృష్ణ ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి మూర్తి, సర్పంచ్ కందల రాజనర్సింహ, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆయా గ్రామాల ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story