- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేట జిల్లాలో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త.. ఆపై..!
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య గొంతు కోశాడు భర్త. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య గొంతు కోశాడు భర్త. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శ నగర్ లో ఎల్లయ్య, భార్య శ్రీలత, కూతురు అర్చనతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబంలో ఏమైందో తెలియదు కానీ ఉదయం ఎల్లయ్య భార్య శ్రీలత (40) గొంతు కోశాడు. అడ్డు వచ్చిన కూతురు అర్చన ను రోకలి బండతో కొట్టాడు. భర్త ఎల్లయ్య భయంతో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






