- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంఆర్ఎఫ్ తో పేదలకు భరోసా : ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి
సీఎంఆర్ఎఫ్ తో పేదలకు భరోసా కలుగుతుందని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ భూమయ్య, గ్రామ ఉపసర్పంచ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, జగదేవపూర్ : సీఎంఆర్ఎఫ్ తో పేదలకు భరోసా కలుగుతుందని ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ భూమయ్య, గ్రామ ఉపసర్పంచ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన కుడుదుల లింగం, బట్టు కావ్య, మన్నె రామాంజనేయులు ఇటీవల హాస్పటల్లో చికిత్స పొందారు. అనంతరం మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు చెక్కులను అందజేశారు. కుదుడుల లింగంకు రూ. 82వేలు, బట్టు కావ్యకు రూ. 15వేలు, మన్నే రామాంజనేయులుకు రూ. 21,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ తో పేదల బతుకులకు భరోసా కలుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్య బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నట్లయితే వెంటనే సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అశోక్, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, నాయకులు ఎల్లారెడ్డి, అశోక్, లచ్చిరెడ్డి, సీతయ్య, నిఖిల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సత్తయ్య, నాగరాజు, రాంరెడ్డి పాల్గొన్నారు.






